సీయోను పాటలు సంతోషముగా
పాడుచు సీయోను వెల్లుదము
లోకాన శాశ్వతానందమేమియు
లేదని చెప్పెను ప్రియుడేసు
పొందవలె నీ లోకమునందు
కొంతకాలమెన్నో శ్రమలు ||సీయోను||
ఐగుప్తును విడచినట్టి మీరు
అరణ్యవాసులే ఈ ధరలో
నిత్యనివాసము లేదిలలోన
నేత్రాలు కానానుపై నిల్పుడి ||సీయోను||
మారాను పోలిన చేదైన స్థలముల
ద్వారా పోవలసియున్ననేమి
నీ రక్షకుండగు యేసే నడుపును
మారని తనదు మాట నమ్ము ||సీయోను||
ఐగుప్తు ఆశలనన్నియు విడిచి
రంగుగ యేసుని వెంబడించి
పాడైన కోరహు పాపంబుమాని
విధేయులై విరాజిల్లుడి ||సీయోను||
ఆనందమయ పరలోకంబు మనది
అక్కడనుండి వచ్చునేసు
సీయోను గీతము సొంపుగ కలసి
పాడెదము ప్రభుయేసుకు జై ||సీయోను||
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
సీయోను పాటలు సంతోషముగా పాడుచు సీయోను Lyrics
Your favourites
- No Favourites found!
