Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
సీయోనుకన్యా సంభ్రమపడుచు వేయుము కేకల్ పాయక Telugu Christian Song Lyrics

సీయోనుకన్యా సంభ్రమపడుచు వేయుము కేకల్ పాయక Lyrics

సీయోనుకన్యా సంభ్రమపడుచు వేయుము కేకల్ పాయక నీ రాజు
భారవాహక మెక్కి బాలస్తోత్రములతో బైలుదేరి వచ్చె ||సీయోను||

1. హెబ్రాయిలోను నీ రాజు పేరు యూదులరాజు హెబ్రీయ జనులను
అబ్రాము కొడుకులను విభవదేశము జేర్చు శుభరాజు యీతండే
||సీయోను||

2. హెల్లేనీలోను నీ రాజు పేరు యూదులరాజే యెల్లపాపులఁ బ్రోచు
తాల్మిరక్షకుఁడితఁడు చల్లని ప్రభువని గొల్గొత మ్రోగెను ||సీయోను||

3. ఉర్వి రోమాలో నీ రాజు పేరు యూదులరాజే సర్వరాష్ట్రికులకు
బూర్వపితరులతోను వరసింహాసన మిచ్చు వరదేశాధిపుఁ డితఁడు
||సీయోను||

4. వాసిగ హెబ్రీ హెల్లేనీలో రోమాయిలోను హోసన్నా ప్రభుని
పేరట వచ్చు మెస్సీయ్యదావీదు కొడుకా శ్రీశుభములు ||సీయోను||

Your favourites

  • No Favourites found!