Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
సీయోను పాటలు సంతోషముగా పాడుచు Telugu Christian Song Lyrics

సీయోను పాటలు సంతోషముగా పాడుచు Lyrics

సీయోను పాటలు సంతోషముగా
పాడుచు సీయోను వెల్లుదము (2)

లోకాన శాశ్వతానందమేమియు
లేదని చెప్పెను ప్రియుడేసు (2)
పొందవలె నీ లోకమునందు
కొంతకాలమెన్నో శ్రమలు (2)       ||సీయోను||

ఐగుప్తును విడచినట్టి మీరు
అరణ్యవాసులే ఈ ధరలో (2)
నిత్యనివాసము లేదిలలోన
నేత్రాలు కానానుపై నిల్పుడి (2)   ||సీయోను||

మారాను పోలిన చేదైన స్థలముల
ద్వారా పోవలసియున్ననేమి (2)
నీ రక్షకుండగు యేసే నడుపును
మారని తనదు మాట నమ్ము (2) ||సీయోను||

ఐగుప్తు ఆశలనన్నియు విడిచి
రంగుగ యేసుని వెంబడించి (2)
పాడైన కోరహు పాపంబుమాని
విధేయులై విరాజిల్లుడి (2)          ||సీయోను||

ఆనందమయ పరలోకంబు మనది
అక్కడనుండి వచ్చునేసు (2)
సీయోను గీతము సొంపుగ కలసి
పాడెదము ప్రభుయేసుకు జై (2)   ||సీయోను||

Your favourites

  • No Favourites found!