Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
సీయోను పురమా సర్వోన్నతుని శృంగారపురమా సీయోనుపురమాఅను Telugu Christian Song Lyrics

సీయోను పురమా సర్వోన్నతుని శృంగారపురమా సీయోనుపురమాఅను Lyrics

సీయోను పురమా - సర్వోన్నతుని
శృంగారపురమా - సీయోనుపురమా
అను శాశ్వతముగ దైవ - సంకల్పంబైతివి
స్వర్ణాలంకార సీయోను
సతతము నీదే యనుభవ భాగ్యము
1. షాలేము రాజు సంతోషముగా - సంధించెను నిన్ను
షాలేమురాజు అర్పించెను నీలో
అబ్రాహాం కొమరుని - స్వర్ణాలంకార సీయోను
దావీదు పట్టణమనబడెడు
2. ఉత్తర దిక్కున - ఎత్తయిన -శృంగార నగరమా
ఉత్తర దిక్కున సర్వభూమికి
సంతసమిడుచున్నావు స్వర్ణాలంకార సీయోను
రమ్యముగా రంజిల్లు నగరమా
3. నీ నగరులయందు - నివసించుచున్నాడు - నీ ప్రభువు
నీ నగరులయందు రాజులు కూడిరి
నీ తేజము జూచిరి - స్వర్ణాలంకార సీయోను
భ్రమపడి త్వరగా - పరుగిడిపోయిరి
4. నిత్యుండగు తండ్రి - నీ నిర్మాణకుడు - శిల్పియు తానె
నిత్యుండగు తండ్రి ప్రభుయేసే నిన్ను
పరిణయమాడను కోరెన్ - స్వర్ణాలంకార సీయోను
వైవాహికానందము నీదే
5. రక్షణ వార్తలు - రమ్యముగా - నీలో వినబడుచున్నవి
రక్షణ వార్తలు జనులెల్ల నీలో
జన్మించెనందురు స్వర్ణాలంకార సీయోను
జనముల తల్లియని నిన్నందురు
6. నిండియున్నవి - నీలో దైవోద్దేశము - లెన్నెన్నో
నిండియున్నవి ఘన కార్యము లెన్నో
గొప్పగ జరిగెను నీలో - స్వర్ణాలంకార సీయోను
విభవమును వివరింపగ లేము
7. సొంపుగ పాడుడి - సంతసముగ - సీయోను పాటలను
సొంపుగ పాడుడి యేసునకే మహిమ
భాసురముగ చెల్లించి - స్వర్ణాలంకార సీయోను
హల్లెలూయా - యేసుప్రభునకే


Your favourites

  • No Favourites found!