Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
సీయోనుకు తిరిగి ప్రభువు వారిని రప్పించినపుడు Telugu Christian Song Lyrics

సీయోనుకు తిరిగి ప్రభువు వారిని రప్పించినపుడు Lyrics

సీయోనుకు తిరిగి ప్రభువు వారిని రప్పించినపుడు
మనము కలలను కనిన వారివలె నుంటిమిగా
1. అప్పుడు నోటి నిండ నవ్వుండెనుగా మనకు
అందుకే మన నాలుక ఆనంద గానముతో నిండె
2. యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు జేసె
అన్య జనులెల్లరు చెప్పుకొనుచుండిరిగా
3. ఘనకార్యంబులను యెన్నో యెహోవా చేసె మనకు
మన మందరము యెంతో ఆనందభరితులమైతిమి
4. దక్షిణ దేశములో నదులు పారునట్లుగా
దయతో చెరలో నున్న మా జనులను రక్షించుము ప్రభువా
5. పిడికెడు విత్తనములు పట్టుకొని పోవువాడు
పంటను కోయును ముదముగ కన్నీటితో విత్తువాడు
6. ఎన్నో ప్రయాసములతో సమకూర్చును పంటంతటిని
సంతోష గానము చేయుచు పనల మోసికొని వచ్చును


Your favourites

  • No Favourites found!