Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
సీయోనుపట్టణమా సువర్ణ నగరమామహిమాపురమా మహా భాగ్యము Telugu Christian Song Lyrics

సీయోనుపట్టణమా సువర్ణ నగరమామహిమాపురమా మహా భాగ్యము Lyrics

1. సీయోనుపట్టణమా - సువర్ణ నగరమా
మహిమాపురమా - మహా భాగ్యము నీదే
రమ్యమైనట్టిరా - రాజుపురమా
2. సీయోను సుందరులు - సువర్ణ సములు
వన్నెపగడాల ఛాయ - కన్న గొప్పది
కాంతి నీలములకన్న - మంచిది
3. ప్రభువే నిన్ను కోరి - ప్రేమించినాడు
సర్వోన్నతుడే నిన్ను - స్థిరము జేసెను
నిత్యనివాసముగ - నిను జేసెను
4. తన చంటిపిల్లను - తల్లి మరచునా
మరచినగాని నేను - మరువను నిన్ను
చెక్కితిని నిను నా యర - చేతుల మీద
5. భయమేల సీయోను - బలమొందిలెమ్ము
సంతసమున పాట సాహా - సమున పాడుడీ
వసియించు నీ ప్రభువు వచ్చి నీలో
6. పెండ్లి కుమారుడు - పెండ్లి కూతురును
చూచునట్లు నిన్ను - చూచి దేవుడు
సీయోను నీయందు - సంతస మొందున్
7. సీయోను పగవారు - సిగ్గునొందెదరు
నిన్ను భాదించినట్టి - నీ పగవారు
పరుగున నీ పాదముల - పై బడెదరు
8. సీయోను నీ నీతి - సూర్య కాంతివలె
రయమున యేసు నీదు - రక్షణజ్యోతి
వెలిగించువరకు - విశ్రమించడు


Your favourites

  • No Favourites found!