Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
సీయోనురాజు వచ్చును మదిన్ సిద్ధపడు మీ Telugu Christian Song Lyrics

సీయోనురాజు వచ్చును మదిన్ సిద్ధపడు మీ Lyrics

సీయోనురాజు వచ్చును మదిన్ సిద్ధపడు
మీ తనువుల్ శుద్ధిచేయుడి మీ రాజుకొరకే
1. లోకస్తులు ప్రశ్నింతురు మరి మీ రాజు యెవరని
తన శక్తిని విన్నవారు చూడ నాశింతురుగా
క్రీస్తే మన రారాజని ఉత్సహించెదము
2. వాహనములు ఎన్నియున్న గార్ధభమును యెక్కెను
తా నెవరియింట నుండునో వారిని యుద్ధరించును
పరీక్షించ ఆయనను చేర్చుకో నీయందు
3. యేసుని స్వీకరించెడు వారేగుదు రాయనతో
తృణీకరించువారలు నశింతురు నిక్కంబుగ
ప్రాముఖ్యమౌ ప్రశ్నయిది యోచించి చూచుకో
4. రాజుల రాజు ఆయనే ప్రభుల ప్రభువాయనే
న్యాయవంతుడు ఆయనే మహాత్ముడైన దేవుడు
సదా రాజ్యంబాయనదే ఆనంద మొందుడి


Your favourites

  • No Favourites found!