Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
శాశ్వతమైనది ప్రేమ యెహోవా తండ్రి ప్రేమఅను Telugu Christian Song Lyrics

శాశ్వతమైనది ప్రేమ యెహోవా తండ్రి ప్రేమఅను Lyrics

శాశ్వతమైనది ప్రేమ - యెహోవా తండ్రి ప్రేమ
అను ప్రేమలో భయమేమియు లేదు - ప్రేమ పరిపూర్ణంబైయున్న
భయమును - పారగద్రోలున్
1. దీర్ఘకాలము ప్రేమ - దయచూపి సహించును
మత్సరపడదీ యుత్తమ ప్రేమ
డంబముగా నడువనిదీ ప్రేమ - ఉప్పొంగనిదీ ప్రేమ
2. స్వప్రయోజనమును - ఎప్పుడు కోరనిదీ ప్రేమ
అమర్యాదగ నడువని ప్రేమ
త్వరగా కోపపడని ప్రేమ - తలచదు అపకారమును
3. దుర్నీతిలో గాక - సత్యాన సంతోషించున్
అన్నిటిని తాళుకొను ప్రేమ
అన్నిటినమ్మియోర్చెడి ప్రేమ - అన్నిటి నిరీక్షించున్
4. నిలుచును విశ్వాసము - నిరీక్షణయు మరి ప్రేమ
వీటిలో శ్రేష్టమైనది ప్రేమ
ప్రేమను కల్గియుండుటకు - ప్రయత్నించుడి మీరు
5. ప్రేమలేనివాడు - దేవుని ఎరుగనివాడు
మన దేవుడు ప్రేమస్వరూపి
తన ప్రేమ మనలో సంపూర్ణ - సిద్ధిని పొందవలయు
6. నిన్నడుగుచున్నాడు - నిను ప్రేమించిన ప్రభుయేసు
నన్ను ప్రేమించుచున్నవా?
వీరికంటె నా పై నీకు - ఎక్కువ ప్రేమగలదా?
7. నను ప్రేమించినయెడల - నాయాజ్ఞలను గైకొనుము
మీలో మీరు ఒకరినొకరు
ప్రేమించుకొనుచున్న ఎడల - అదియే మహాదానందం


Your favourites

  • No Favourites found!