శాశ్వతము కాదు ఈ లోకము
నా గమ్యము ఆ పరలోకము (2)
నా గమ్యస్థానము నా యేసుని యందే
యుగయుగములకు ప్రభుతో వసియింతును (2) ||శాశ్వతము కాదు||
స్థలమును సంసిద్ధము చేయుటకు
వెళ్ళాడు నా కొరకే ప్రభు యేసుడు (2)
నా తండ్రి గృహముకు నను చేర్చడానికి
వస్తాడు వేగమే నను కొనిపోవుటకు (2) ||శాశ్వతము కాదు||
ఆవిరి వంటిది ఈ జీవితం
ఏ క్షణమో తెలియదుగా నా అంతము (2)
నా ప్రియుడు నా కొరకై రాబోయే దినమో
ప్రేమతో తన ఇంటికి నను పిలిచే క్షణమో (2) ||శాశ్వతము కాదు||
నా ప్రభుని ఇంటిలో నాకు ఎప్పుడూ
సంతోషమే సమాధానమే (2)
ఈ లోక యాత్ర ముగిసిన వేళ
నా తండ్రి రొమ్మున నేనుందును (2) ||శాశ్వతము కాదు||
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
శాశ్వతము కాదు ఈ లోకము నా Lyrics
Your favourites
- No Favourites found!
