Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
శక్తిగల షాలేమురాజా షారోను రోజా స్తుతియించెదము Telugu Christian Song Lyrics

శక్తిగల షాలేమురాజా షారోను రోజా స్తుతియించెదము Lyrics

శక్తిగల షాలేమురాజా షారోను రోజా
స్తుతియించెదము యేసు
1. పూర్వమున పల్కిన నీ ప్రవచవోక్తులన్ని
చక్కగను మక్కువతో చేసితివి నీవు - చేసితివి నీవు
పూర్వమున చూపిన నీ ప్రత్యక్షతలన్ని - వరుసగను జరిపితివి నిన్ను
పోలినవాడు వేరెవ్వరు లేరు
2. బయలు పరచినట్టి నమూనాను పోలి నాడు
బలముగను నీదు ప్రత్యక్ష గుడారమును - నీ గుడారమును
కట్టితివి నీ దాసుడై నట్టి మోషే ద్వారా
నింపితివి నిండైన నీ ప్రభావ మహిమను - ప్రభావ మహిమను
3. షాలేము యెసూషలేములోని ఆలయము
సొలొమోను ద్వారా కట్టించిన మహారాజా - కట్టించిన రాజా
ఆలయమును నిర్మించినట్టి మహారాజా
నింపితివి నిండైన నీ ప్రభావ మహిమను - ప్రభావ మహిమను
4. కాలము సంపూర్ణముగ పరిణమించగానే
కన్య గర్భమున ప్రభో జన్మించితి వీవు - జన్మించితి వీవు
కట్టెదను నా సంఘము నని సెలవిచ్చి
కట్టుచున్నావు మమ్ముల నీ స్వరూపమునకు - నీ ఆలయముగను
5. హస్తకృతాలయములో వసించని నీవు
వింతగాను మా మధ్యను ఉండగోరినావు - ఉండగోరినావు
కాంతివంతమైన నీదు మహా మహిమతోనే
స్వంత వారినంత నింప తీర్మానించినావు - తీర్మానించినావు
6. అక్కడను ఇక్కడ నొక్కొక్కరిని యేరి
అద్భుతముగను జత చేయువాడ వీవు - చేయువాడ వీవు
నూతన దంపతులను వింతగా దీవించి
అంతకంతకు వర్ధిల్ల జేయువాడ వీవే - కాయువాడ వీవే
7. వ్యక్తులను కుటుంబములనుగా మార్చివేసి
శక్తిగల సంఘ వధువుగ మార్చివేసి - నీవే మార్చివేసి
వింతగా నా వధువునకు వరుండవై నావు
ఆంతము లేదహా నీ మహిమ రాజ్యమునకు - హల్లెలూయా ఆమెన్


Your favourites

  • No Favourites found!