షాలోము రాజుకు వందనం
సీయోను పాటలు పాడెదం (2)
యేసు రాజ వందనం
మహిమ రాజ వందనం
మృత్యుంజయుడా వందనం
ముక్తి దాత వందనం ||షాలోము||
ఖాళీ అయిన సమాధి చూసి
చావు పరుగులు తీసెను అలసి
పాపమొందిన ఓటమి తెలిసి
పారిపోయెను అపవాది జడిసి (2) ||యేసు రాజ||
మొదటి ఆదాము చేసిన పాపం
మానవులపై తెచ్చెను మరణం
కనికరముతో కడపటి ఆదాము
గెలిచి మరణము తెచ్చెను జీవం (2) ||యేసు రాజ||
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
షాలోము రాజుకు వందనంసీయోను పాటలు పాడెదం Lyrics
Your favourites
- No Favourites found!
