Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
శాంతిదాయక యేసు ప్రభూ శాంతిదాయక యేసు Telugu Christian Song Lyrics

శాంతిదాయక యేసు ప్రభూ శాంతిదాయక యేసు Lyrics

శాంతిదాయక యేసు ప్రభూ
శాంతిదాయక యేసు శాంతిదాయక
1. ధవళవర్ణుడ రత్న వర్ణుడ - మహిమపూర్ణుడ మనోహరుడా
నిత్య రాజ్య మహిమకు పిల్చిన - సత్యముగ నిన్ను పూజించెదము
2. పరజనులను పరదేశులను - పరిశుద్ధులతో నైక్యపరచి
పరలోక పౌరులుగా మార్చి - పరలోక పిలుపుకు లోబర్చిన
3. సువార్తతో మమ్ము పిలిచితివి - సువార్తికులుగ చేసితివి
రిక్తులకు మాదైశ్వర్య మిచ్చి - శక్తితో వారసులుగ చేసిన
4. ఆదియం దేర్పరచు కొంటివి - ఏవి నీచమో ఏవి ఘనమో
గురుతుపట్టి ఎరుగ మంటివి - నోరుగ జేతునను వాగ్దానము
5. స్వర్ణమయుడా కాంక్షణీయుడా - పదివేలలో గుర్తింప యోగ్యుడా
బోధింప నేర్పు శుద్ధాత్ముని - శోధింపలేని ఐశ్వర్యము నిచ్చె
6. అక్షయ జీవమిచ్చిన రక్షక - పరీక్షలో నిల్చు నిరీక్షణలో
అక్షయ దేహ మిచ్చెదవని - ప్రత్యక్షతకై వేచియుండెదము
7. సర్వ కృపానిధి సర్వేశ్వరా - సర్వము స్వతంత్రించుకొన
ఉర్వియందు విజయములే యని - సర్వోన్నతుడు నుడివెను
8. పరలోకానంద పరిపూర్ణుడా - సకలాశీర్వాద సంయుతుడా
మహిమ ఘనత ప్రభావంబులు - నీవే యని ప్రహర్షించెదము


Your favourites

  • No Favourites found!