Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
శరణు శరణు యేసు దేవా నన్నుఁ Telugu Christian Song Lyrics

శరణు శరణు యేసు దేవా నన్నుఁ Lyrics

శరణు శరణు యేసు దేవా నన్నుఁ గరుణింపవే నిత్య జీవా పరమ
దేవుని తనూ భవుఁడవై ధరణిలో నర రూపమైతివి నరులను రక్షింప
||శరణు||

1. దైవోగ్రమునకుఁ బాత్రుఁడను విమల భావమునకే నసహ్యుఁడను
గావరించిన పాప కర్ముఁడన్ కఠినుఁడన్ జానవలసిన యట్టి స్వామి
ద్రోహు డ నయ్య ||శరణు||

2. మద మత్సరమ్ములు మెండై నాదు మది నాక్రమించెను నిండై
సదయుండ నీ దివ్య సర్వాజ్ఞలన్ మీరి విదితముగఁ బాపముల్ వేడ్కను
జేసితి ||శరణు||

3. మోసంబులోఁ జిక్కి చాల నేను దోసంబు చేసితినిల యేసు నాధుని
సిలువ నేమాత్రమైన నే నాసతోఁ జూడని యన్యాయ పరుఁడను ||శరణు||

4. నెమ్మ దించుక యైన మదిలో లేక గ్రమ్ముకొని యఘము నా యెదలోఁ
ద్రిమ్మరినై భువిన్ దిరిగి వేసారఁగ సమ్మతము దొరక దో సర్వేశ నీకంటె
||శరణు||

5. నా తండ్రి యో యేసునాధా నిన్ను ఘాతఁజేసిన దేనుగాదా నీతిమాలిన
పాప నీచుఁడన్ దుష్టుఁడన్ నా తప్పు క్షమియించి నన్నేలి రక్షించు ||శరణు||

6. కడుదయా శాంతస్వభావా నన్ను దడవుజేయక యేలుకోవా యొడబడి
కుజనులకై యోర్చియలసటను బడి జీవమిడిననా ప్రాణ రక్షక కావు
||శరణు||

Your favourites

  • No Favourites found!