Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
శిలనైన నన్ను శిల్పివై మార్చావునాలోని ఆశలు Telugu Christian Song Lyrics

శిలనైన నన్ను శిల్పివై మార్చావునాలోని ఆశలు Lyrics

శిలనైన నన్ను శిల్పివై మార్చావు
నాలోని ఆశలు విస్తరింపచేసావు (2)
నీ ప్రేమ నాపై కుమ్మరించుచున్నావు (2)
నీ ప్రేమే నా ఊపిరి – నీ ప్రేమే నా కాపరి (2) ||శిలనైన||
మోడుబారిన నా జీవితం
నీ ప్రేమతోనే చిగురింపచేసావు (2)
నీ ప్రేమాభిషేకం నా జీవిత గమ్యం (2)
వర్ణించలేను లెక్కించలేను (2)
నీ ప్రేమే నా ఊపిరి – నీ ప్రేమే నా కాపరి (2) ||శిలనైన||
ఏ విలువలేని అభాగ్యుడను నేను
నీ ప్రేమచూపి విలువనిచ్చి కొన్నావు (2)
నాయెడల నీకున్న తలంపులు విస్తారం (2)
నీ కొరకే నేను జీవింతు ఇలలో (2)
నీ ప్రేమే నా ఊపిరి – నీ ప్రేమే నా కాపరి (2) ||శిలనైన||
ఊహించలేను నీ ప్రేమ మధురం
నా ప్రేమ మూర్తి నీకే నా వందనం (2)
నీ ప్రేమే నాకాధారం – నా జీవిత లక్ష్యం (2)
నీ ప్రేమే నా ఊపిరి – నీ ప్రేమే నా కాపరి (2) ||శిలనైన||

Your favourites

  • No Favourites found!