Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
శ్రేష్టగీతము వినబడుచున్నది యేసు లేచెను ఈ Telugu Christian Song Lyrics

శ్రేష్టగీతము వినబడుచున్నది యేసు లేచెను ఈ Lyrics

శ్రేష్టగీతము వినబడుచున్నది యేసు లేచెను - ఈ
కష్టలోకమందు మనకు మిత్రు - డాయనే
1. మాయక్షితిని రక్షింప వచ్చిన పరమ నాయకుడు - ఈ
భయంకర చీకటి పోగొట్ట వచ్చిన ప్రభువు
2. ముండ్ల కిరీటమును ధరించి ముఖమున గొట్టబడెన్ - ఆ
గండుదొంగను సిలువలో వ్రేలాడి రక్షించెన్
3. హీనమైన ఈటెతోడ ప్రక్కన గ్రుచ్చబడెను - ఆ
పావనమగు రక్త ఊట ప్రవహించెన్
4. మూడవ దినమున సమాధి నుండి కర్త లేచెను - తన
తోడిశిష్యులు చూచుచుండ నారోహణమాయెన్
5. జయము జయము అనుచు నీవు ప్రకటించుము - నీ
జన్మమెల్ల యేసుని గూర్చి సాక్ష్యమీయుము
6. ఆరోహణమైనట్లు మరల వచ్చెద ననెను - ఈ
ధరణికి వేంచేయు కాలము సమీపించెను
7. హల్లెలూయ పాడుచు నార్భాటముగ నాడు - ఆ
వల్లభుడేసు నెదుట నిలువ నాయత్తపడుము


Your favourites

  • No Favourites found!