Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
శ్రీ వినోద దాయకంబు దేవుని వాక్యంబు Telugu Christian Song Lyrics

శ్రీ వినోద దాయకంబు దేవుని వాక్యంబు Lyrics

శ్రీ వినోద దాయకంబు దేవుని వాక్యంబు జీవమునకు నాస్పదంబు
చిరమగు ధనంబు భావంబుల మార్చు నంబు బహుళ సాధనంబు ||శ్రీ||

1. పాప తతికి నాయుధంబు పాపి కాశ్రయంబు భూపతులకు దుస్తరంబు
పుణ్య సాధనంబు శాప మడంచెడు శరంబు జగతికి విభవంబు ||శ్రీ||

2. స్వాతంత్ర్య మిడు దనంబు సర్వశ్రేయంబు ఘాతకులకు ఖడ్గంబు
నీతికినిలయంబు ప్రీతిని గరపెడు విధంబు ఖ్యాతికిఁ బథంబు ||శ్రీ||

3. సత్య విరాజితంబు నిత్య శోభితంబు భృత్య వరుల సంచకరము
భీతున కభయంబు చేతో విభవంబు సుగుణ శిష్యుల హారంబు ||శ్రీ||

4. కర్తఁ జూపు నద్దంబు ఘనమహాద్భుతంబు దురితతతికి నస్త్రంబు దు
ఖశోషణంబు పరమోపదేశంబు బహుళమానితంబు ||శ్రీ||

5. సర్వజనులకును హితంబు సౌఖ్యసాధనంబు శాంతికి నిజమార్గంబు
జగడముల హరంబు జగము నంతకును వరంబు సత్యవిజయంబు ||శ్రీ||

6. కోలాహల కారణంబు చాల ప్రాచీనంబు మూలమౌ ధనంబు జగము
నేలెడి తంత్రంబు జాలియె దన సూత్రంబు మేలు భూషణంబు ||శ్రీ||

7. జ్ఞానికి దుర్ గ్రాహ్యంబు దాని బోధనంబు దీనజనుల కర్థంబు దివ్య
శోభితంబు మానితభక్తిని దినంబు మానని పఠనంబు ||శ్రీ||

Your favourites

  • No Favourites found!