శ్రీ యెహోవా నీ కొసంగెద శ్రేయ మొదవఁగ నాదు సంపదఁ బాయక
నీ సమ్ముఖమ్మున నే యెడ నివసింతు భక్తితో ||శ్రీ||
1. అడఁకువతో నీ పాదములఁబడి యొడయుఁడా నావెల్ల నీకిడి తడవు
చేయక కొల్తు నిన్నుఁ దండ్రి నన్నంగీకరించుమి ||శ్రీ||
2. నీవు నా రాజువు నిరతము నేను నీ బిడ్డను నిశ్చయము పావనాత్ముని
యెదుట నాదు జీవ మిడుదు సజ్జీవనముకయి ||శ్రీ||
3. ప్రభువరా యర్పించుకొందు భక్తితోడ నన్ను నిందు శుభప్రదము లగు
శక్తులతో నను సొంపుమీరఁగ నింపు స్వామీ ||శ్రీ||
4. మహిమస్తుతులు చెల్లు నీ నా మంబునకు నిత్యంబుగా న న్నిహ పరంబుఁ
బ్రోచువాఁడ నీవె సుమ్మా లోక రక్షకా ||శ్రీ||
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
శ్రీ యెహోవా నీ కొసంగెద శ్రేయ Lyrics
Your favourites
- No Favourites found!
