Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
శ్రీ యేసు పుట్టె జగమందు సమస్త Telugu Christian Song Lyrics

శ్రీ యేసు పుట్టె జగమందు సమస్త Lyrics

శ్రీ యేసు పుట్టె జగమందు - సమస్త పాపులకు విందు
సాతాను శక్తులిక బందు - ఈ భాగ్యమెరుగ రిలముందు ||శ్రీ యేసు ||
1. బీదల కష్టము గాంచి - సదా తా సౌఖ్యమునుడించి
పశుల తొట్టి మదినెంచి - శ్రీ మేరి సుతుడుగా నెంచి ||శ్రీ యేసు ||
2. భక్తాళి నెల్ల బోషింప - ప్రశస్త కాంతి వెలిగింప
బ్రేమాది సుగుణముల నింప - సిలువపై మరణింప ||శ్రీ యేసు ||
3. వేదామృతంబు చవినిల - సుఖంబు మదికినిడు చాల
చూపింప నేగె నీలీల - నరావతారుడై యిల ||శ్రీ యేసు ||
4. ఆనందమూర్తి మదివేడ - సమస్త దుఃఖమును వీడ
యత్యానందంబునం -బాడ- శ్రీ మేరి భాగ్యమనియాడ ||శ్రీ యేసు ||
5. మోక్షంపు దారి జూపింప - రక్షణవార్త వినిపింప
యక్షయ జయములను బాపి - రక్షణసేవ ధరనింప ||శ్రీ యేసు ||

Your favourites

  • No Favourites found!