శ్రీ యేసుండు జన్మించె రేయిలో ||2||
నేడు పాయక బెత్లెహేము ఊరిలో ||2|| ||శ్రీ యేసుండు||
ఆ కన్నియ మరియమ్మ గర్భమందున ||2||
ఇమ్మానుయేలనెడి నామమందున ||2|| ||శ్రీ యేసుండు||
సత్రమందున పశువులశాల యందున ||2||
దేవపుత్రుండు మనుజుండాయెనందునా ||2|| ||శ్రీ యేసుండు||
పట్టి పొత్తి గుడ్డలతో చుట్టబడి ||2||
పశుల తొట్టిలో పరుండ బెట్టబడి ||2|| ||శ్రీ యేసుండు||
గొల్లలెల్లరు మిగుల భీతిల్లగా ||2||
దెల్పె గొప్ప వార్త దూత చల్లగా ||2|| ||శ్రీ యేసుండు||
మన కొరకొక్క శిశువు పుట్టెను ||2||
ధరను మన దోషములబోగొట్టెను ||2|| ||శ్రీ యేసుండు||
పరలోకపు సైన్యంబు గూడెను ||2||
మింట వర రక్షకుని గూర్చి పాడెను ||2|| ||శ్రీ యేసుండు||
అక్షయుండగు యేసు పుట్టెను ||2||
మనకు రక్షణంబు సిద్ధపరచెను ||2|| ||శ్రీ యేసుండు||
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
శ్రీ యేసుండు జన్మించె రేయిలో Lyrics
Your favourites
- No Favourites found!
