Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
శ్రీ యేసునే భజించు నా మనసా Telugu Christian Song Lyrics

శ్రీ యేసునే భజించు నా మనసా Lyrics

శ్రీ యేసునే భజించు నా మనసా శ్రీ యేసునే భజించు శ్రీ యేసు
ప్రభునే భజించు నా మనసా శ్రీ యేసునే భజించు ||శ్రీ యేసు||

1. యేసు త్రిత్వమం దీశ కుమారుఁడు భాసురుఁ డాతఁడు భూషిత
రక్షకుఁడు ||శ్రీ యేసు||

2. నరుల దురితస్థితిఁ గరుణించి వారికిఁ పరమ సుఖము లిడ పరికించి
వచ్చిన ||శ్రీ యేసు||

3. స్వామికి మహిమయు భూమికి నెమ్మది క్షేమము నియ్యను లేమిడిఁ
బుట్టిన ||శ్రీ యేసు||

4. నరులను తండ్రితో నైక్యము జేయగ నిరతము వేఁడెడి నిజప్రాపకుఁ
డగు ||శ్రీ యేసు||

5. మూఁడవ దినమున మృత్యువు నోడించి తడయక పునరు త్థానము
నొందిన ||శ్రీ యేసు||

Your favourites

  • No Favourites found!