Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
శృంగార దేశము చేరఁగానేనా దుఃఖ బాధలన్నియుఁ Telugu Christian Song Lyrics

శృంగార దేశము చేరఁగానేనా దుఃఖ బాధలన్నియుఁ Lyrics


1. శృంగార దేశము చేరఁగానే
నా దుఃఖ బాధలన్నియుఁ బోవున్
యేసుని యొద్దను నిత్యమునే
నుండుట మిక్కిలి యాశ్చర్యము
||ఇదే నాకు ఆనందము
ఆనందము, ఆనందము
నేను ఆయనను జూచుటయే
ఇదే నాకుఁ బరమానందము||

2. అమితమైన కృపవలన
నన్ను స్వర్గంబునఁ జేర్చుదురు
అచ్చోటనుండి యేసుని గాంచి
స్తుతి కీర్తనలు పాడుదును.

3. నేను ప్రేమించు స్నేహితులును
అక్కడఁ జూచి సంతోషింతును
నాయేసు ముఖము చూచుటయే
నిత్యము నాకది యానందము.

4. ఆ స్వర్గ సౌఖ్య మొందువరకు
కండ్లతోఁ జూడక పోయినను
యేసుని మాటలు గైకొనుచు
నాత్మతోఁ జూచి సంతోషింతును

Your favourites

  • No Favourites found!