Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
శుద్ధి, శుద్ధి, శుద్ధి! సర్వశక్త ప్రభుప్రాతఃకాలస్తుతి Telugu Christian Song Lyrics

శుద్ధి, శుద్ధి, శుద్ధి! సర్వశక్త ప్రభుప్రాతఃకాలస్తుతి Lyrics



1.
శుద్ధి, శుద్ధి, శుద్ధి! సర్వశక్త ప్రభు
ప్రాతఃకాలస్తుతి నీకీ చెల్లింతుము
శుద్ధి, శుద్ధి, శుద్ధి! కృపగల దేవా!
ముగ్గురైయుండు దైవత్ర్యేకుఁడా!

2.
శుద్ధి, శుద్ధి, శుద్ధి! అని పరమందుఁ
బరవాసు లెల్ల నిన్నేశ్లాఘింతురు
శెరపుల్ ఖెరూబుల్ సాష్టంగపడి
నిత్యుఁడవైన నిన్ నుతింతురు.

3.
శుద్ధి, శుద్ధి, శుద్ధి! తేజరిల్లు దేవ
పాపి కన్ను చూడలేని మేఘ వాసివి
అద్వితీయప్రభు, నీవు మాత్రమేను
కరుణ, శక్తి, ప్రేమరూపివి.

4.
శుద్ధి, శుద్ధి, శుద్ధి! సర్వశక్త ప్రభు
సృష్టిజాలమంత నీ కీర్తిఁబాడును
శుద్ధి, శుద్ధి, శుద్ధి! కృపగల దేవ
ముగ్గురైయుండు దైవత్ర్యేకుఁడా!

Your favourites

  • No Favourites found!