Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
సిలువ చెంత చేరిననాడు కలుషములను కడిగివేయున్ Telugu Christian Song Lyrics

సిలువ చెంత చేరిననాడు కలుషములను కడిగివేయున్ Lyrics


సిలువ చెంత చేరిననాడు
కలుషములను కడిగివేయున్
పౌలువలెను సీలవలెను
సిద్ధపడిన భక్తులజూచి

కొండలాంటి బండలాంటి
మొండి హృదయంబు మండించు
పండియున్న పాపులనైన
పిలచుచుండే పరము చేర      ||సిలువ||

వంద గొర్రెల మందలోనుండి
ఒకటి తప్పి ఒంటరియాయే
తొంబది తొమ్మిది గొర్రెల విడిచి
ఒంటరియైన గొర్రెను వెదకెన్    ||సిలువ||

తప్పిపోయిన కుమారుండు
తండ్రిని విడచి తరలిపోయే
తప్పు తెలిసి తిరిగిరాగా
తండ్రియతని జేర్చుకొనియే     ||సిలువ||

పాపి రావా పాపము విడచి
పరిశుద్ధుల విందుల జేర
పాపుల గతిని పరికించితివా
పాతాళంబే వారి యంతము    ||సిలువ||

Your favourites

  • No Favourites found!