సిలువా ఓ సిలువా నీకెందుకే ఈ విలువ (2)
యేసయ్యా నిను ఎత్తుకున్నందుకా
నీవు యేసయ్యను మోసినందుకా (2) || సిలువ ||
1. మా పాప భారమంతా మోసాడు కల్వరి గిరిలో
మా పాప పరిహారముకై చిందించాడు తన రక్తమంతా (2)
మన కొరకై తన ప్రాణమిచ్చెను
పునరుత్థానుడై తిరిగి లేచెను (2)
అందుకే నాకీ విలువా (2) || సిలువ ||
2. బంధిచిన బంధకాలంతా తెంచాడు సిలువలోనాకై
నా దాస్యపు బ్రతుకంతా విడిపించాడు యేసయ్య నాకై (2)
రాజరికము నాకు ఇచ్చి
తన రాజ్యమునే సిద్ధపరచెను (2)
అందుకే నాకీ విలువా తెలుసుకోవే సిలువ (2) || సిలువ ||
