Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
సిలువేకదా చింతసదామహా సిలువేకదా మనకమోఘము వెలలేనియాత్మ Telugu Christian Song Lyrics

సిలువేకదా చింతసదామహా సిలువేకదా మనకమోఘము వెలలేనియాత్మ Lyrics

సిలువేకదా చింతసదామహా సిలువేకదా మనకమోఘము వెలలేని
యాత్మ సంభోగము విలసత్పరమ ద్రవ్యభాగ్యము గుణత్యాగము ననురాగము
మహా ||సిలువే||

1. సిలువ బోధకు చెవినొగ్గుమా చెలువముగొన నాత్మ నొగ్గుము వల్ల నొప్పు
నీకు సౌభాగ్యము ఆత్మారోగ్యము నంతో శ్లాఘ్యము ||సిలువే||

2. చంపెనిందు ప్రభుని కర్తను సంపాదించె నర విముక్తుని బెంపారు
నానందముసూక్తిని ననురక్తిని నిత్యముక్తిని మహా ||సిలువే||

3. పాపదావాగ్ని సంతుప్తులు స్వపుణ్యదుర్మద వ్యాప్తులు నీ పేరు నమ్మిన
దీప్తులు సుఖ ప్రాప్తులు సర్వ తృప్తులు మహా ||సిలువే||

4. రంగొప్ప దీని ప్రసంగము మంగళగీతసారంగము అంగీకార హృత్పద్మ
భృంగము రక్షశృంగము పాపభంగము మహా ||సిలువే||

5. భయములేదని చాటుచున్నది ప్రియయేసు వేడుకొమ్మన్నది దయ జూపు
నీ కనుచున్నది నిక్కమైనది చక్కనైనది మహా ||సిలువే||

6. చేరవచ్చిన వారి భారము ఘోరమైనను తద్విచారము ఆరూఢిపరమార్థ
సారము సువిచారము సదాచారము మహా ||సిలువే||

7. ఘనమైన రక్షక ధ్యానము మనల ముక్తికి జేర్చువైనము జనకృపాసుధా
పానము దూతగానము తేజోమానము మహా ||సిలువే||

8. ఇన్ని దినము లూరకుంటిమి యిపుడే రక్షణ కనుగొంటిమి కన్న తండ్రిని
గొల్వకుంటిమి కానకుంటిమి యెరగకుంటిమి మహా ||సిలువే||

Your favourites

  • No Favourites found!