సిలువలో బలియైన దేవుని గొర్రెపిల్ల
విలువైన నీ ప్రేమన్ వివరింతు శ్రీయేసు
1. ఆనాటి యూదులే నిన్ను జంపిరనుకొంటి
కాదు కాదయ్యయ్యో - నా పాప ఋణమునకే
2. నా యతిక్రమములకై - నలుగగొట్టబడి
నా దోషముల నీవు - ప్రియముగను మోసితివా
3. మృదువైన నీ నుదురు - ముండ్ల పోట్లచేత
సురూపము లేక - సోలిపోతివా ప్రియుడా
4. నా రోగముల నీపై నమ్రతతో భరియించి
తృణీకరింపబడి - ప్రాణమర్పించితివి
5. వ్యసనాక్రాంతుడవుగా - వ్యాధి ననుభవించి
మౌనము ధరించి - మరణమైతివా ప్రభువా
6. నా పాప దోషముచే - నే చచ్చి యుండగనే
మరణమై నాకొరకు - మరి తిరిగి లేచితివా
7. పరమున కెత్తబడిన - ప్రియ యేసురాకడకై
పదిలముగ కనిపెట్టి - పాడెదను హల్లెలూయ
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
సిలువలో బలియైన దేవుని గొర్రెపిల్ల విలువైన Lyrics
Your favourites
- No Favourites found!
