సిలువలో ఆ సిలువలో
ఆ ఘోర కల్వరిలో
తులువల మధ్యలో
వ్రేళాడిన యేసయ్యా (2)
వెలి అయిన యేసయ్యా
బలి అయిన యేసయ్యా
నిలువెల్ల నలిగితివా
నీవెంతో అలసితివా || సిలువలో ||
1. నేరము చేయని నీవు
ఈ ఘోర పాపి కొరకు
భారమైన సిలువ
మోయలేక మోసావు (2)
కొరడాలు చెల్లని చీల్చెనే
నీ సుందర దేహమునే (2)
తడిపెను నీ తనువునే
రుధిరంబు ధారలే (2) ॥ వెలియైన॥
2. నాదు పాప భారం
నిను సిలువకు గురి చేసెనే
నాదు దోషమే నిన్ను
అణువణువున హింసించెనే (2)
నీవు కార్చిన రక్త ధారలే
నా రక్షణకాధారం (2)
సిలువలో చేరెదన్
విరిగిన హృదయముతోను (2) ॥ వెలియైన॥
3. వధకు సిద్దమైన గొర్రెపిల్ల వోలే
మోమున ఉమ్మివేయ మౌనివైనావే
దూషించి అపహసించి హింసించిరా నిన్ను (2)
ఊహకు అందదు నీ త్యాగమేసయ్యా (2) ॥ వెలియైన॥
