సిలువలో నా కొరకు
వ్రేలాడిన యేసయ్యా
పరిశుద్ధ రక్తమును
చిందించినావయ్యా (2)
ఏల ఈ ఘోర శ్రమ
ఘనదైవమా నీకు
పాపిని రక్షించుటకు
బలియైతివా(నీవు) (2)
1. నా పాపయోచనలు
ముండ్ల మకుటమాయెను
నే చేసిన దోషములు
చేతులలో సీలలాయె (2)
నా చెడు నడతలు
ప్రక్కలో బల్లెమాయె (2)
నేనే ప్రభు నిన్ను
సిలువకప్పగించినది (2) || సిలువలో ||
2. నా పాపభారమంత
సిలువలో మోసితివి
వ్యాధి బాధలన్నియు
నీవే భరియించితివి (2)
సురూపివి నీవయ్యా
కురూపిగా మారితివి (2)
ఏమని(నేనేమని) వర్ణింతును
నీ త్యాగ నిరతిని (2) || సిలువలో ||
3. నీ సిలువను చూడగనే
మనసు నీరై కరిగెను
నా హృదయం ఎంతో
వేదనతో నిండెను (2)
ఈ లోకమును వీడి
నిను వెంబడింతునయ్య (2)
క్షమియించి నీ సాక్షిగ
స్థిరపరచుము యేసయ్యా (2) || సిలువలో ||
