సిలువలో సాగింది యాత్ర
కరుణామయుని దయగల పాత్ర
ఇది ఎవరికోసమో
ఈ జగతి కోసమే
ఈ జనుల కోసమే
1. పాలుగారు దేహముపైన
పాపాత్ముల కొరడాలెన్నో
నాట్యమాడినాయి నడివీధిలో నడిపాయి
నోరు తెరువలేదాయె ప్రేమ
బదులు పలుకలేదాయె ప్రేమ || ఇది ఎవరి ||
2. చెళ్ళుమని కొట్టింది ఒకరు
ఆ మోముపై ఊసింది మరియొకరు
బంతులాడినారు బాధలలో వేసినారు
నోరు తెరువలేదాయె ప్రేమ
బదులు పలుకలేదాయె ప్రేమ || ఇది ఎవరి ||
3. వెనుకనుంచి తన్నింది ఒకరు
తనముందు నిలచి నవ్వింది మరియొకరు
గేలిచేసినారు పరిహాసమాడినారు
నోరు తెరువలేదాయె ప్రేమ
బదులు పలుకలేదాయె ప్రేమ || ఇది ఎవరి ||
4. దాహమని అడిగింది ప్రేమ
చేదు దాహాన్ని ఇచ్చింది లోకం
చిరకనిచ్చినారు మరి బరిసెతో గుచ్చారు
నోరు తెరువలేదాయె ప్రేమ
బదులు పలుకలేదాయె ప్రేమ || ఇది ఎవరి ||
