Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
సిలువను మోసి ఈలోకమును తలక్రిందులు చేయు Telugu Christian Song Lyrics

సిలువను మోసి ఈలోకమును తలక్రిందులు చేయు Lyrics

సిలువను మోసి ఈలోకమును
తలక్రిందులు చేయు తరుణమిదే
1. లేలెమ్ము సోదరుడా నిద్రనుండి
ప్రకటింపను యేసు నామమును
సోమరి యేల నిద్రించెదవు
ఈ ధరను లేపెడు సమయమిదే
2. పరిశుద్ధాత్మ కవచము తోడిగి
నీనడుము కట్టి తయ్యారగుమా
సోదరుడా ప్రతి వీధికి వెళ్ళి
సువార్తను చాటెడు సమయమిదే
3. లోకరక్షణకై ప్రభు యేసు
వీకతో నరుదెంచెను ఈ ధరకు
వెలుగును మనకు నిచ్చెను యేసు
తన స్తుతులను పాడెడు సమయమిదే
4. పాతాళమునకు కొనిపోయెడి నీ
పాప నిద్రను విడనాడు మిక
సిలువ మర్మము నెరుగు మిపుడే
కునికెడు సమయము కాదిది ప్రియుడా
5. రక్షింపబడుట కాశించినతో
పశ్చాతాప పడు మీదినమే
కలుషాత్ముండా తడవేలనికన్
కనుమా నీ తేర్పు సమయ మిదే


Your favourites

  • No Favourites found!