Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
సిలువే నా శరణాయెను రా నీ Telugu Christian Song Lyrics

సిలువే నా శరణాయెను రా నీ Lyrics

సిలువే నా శరణాయెను రా నీ సిలువే నా శర ణాయెను రా సిలువ
యందే ముక్తి బలముఁ జూచితి రా ||నీ సిలువే||

1. సిలువను వ్రాలి యేసు పలికిన పలుకు లందు విలువలేని
ప్రేమామృతముఁ గ్రోలితి రా ||నీ సిలువే||

2. సిలువను జూచుకొలఁది శిలసమానమైన మనసు నలిగి కరిగి నీరగు
చున్నది రా ||నీ సిలువే||

3. సిలువను దరచి తరచితి విలువ కందఁగ రాని నీ కృప కలుష మెల్లనూ
బాపఁగఁ జాలును రా ||నీ సిలువే||

4. పలు విధ పథము లరసి ఫలిత మేమి గానలేక సిలువయెదుటను
నిలచినాఁడను రా ||నీ సిలువే||

5. శరణు యేసు శరణు శరణు శరణు శరణు నా ప్రభువా దురిత
దూరుఁడ నీ దరిఁ జేరితి రా ||నీ సిలువే||

Your favourites

  • No Favourites found!