Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
శ్రేష్టమైన నామం – శక్తి గలిగిన Telugu Christian Song Lyrics

శ్రేష్టమైన నామం – శక్తి గలిగిన Lyrics


శ్రేష్టమైన నామం – శక్తి గలిగిన నామం
జుంటి తేనె ధారల కన్నా మధురమైన నామం
సాటిలేని నామం – స్వస్థపరచే నామం
అన్ని నామముల కన్నా నిత్యమైన నామం
యేసు నామం మధుర నామం
యేసు నామం సుమధుర నామం (2)          ||శ్రేష్టమైన||

త్రోవ చూపి సరియైన దారిలో నన్ను నడిపించే నామం
దుష్ట శక్తులు బంధకములు తొలగించే
తరములెన్నో మారినా మనుజులంతా మారినా (2)
మారని నామం మహిమ నామం
మరణము గెల్చిన శ్రీ యేసు నామం (2)          ||శ్రేష్టమైన||

జీవితమంతా జీవనమంతా స్మరించగలిగే నామం
కలవరము నను వెంటాడినను ధైర్యమునిచ్చె ప్రభు నామం
భారమెంతో ఉన్నను శాంతినొసగే దివ్య నామం (2)
మారని నామం మహిమ నామం
మరణము గెల్చిన శ్రీ యేసు నామం (2)           ||శ్రేష్టమైన||

Your favourites

  • No Favourites found!