Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
సృష్టిపితా సర్వోన్నతా సమర్పింతున్ సర్వస్వమున్ Telugu Christian Song Lyrics

సృష్టిపితా సర్వోన్నతా సమర్పింతున్ సర్వస్వమున్ Lyrics

సృష్టిపితా సర్వోన్నతా సమర్పింతున్ సర్వస్వమున్

1. భూమి ఆకాశము నీవే భూధర శిఖరములు నీవే భూ ప్రజలు నీవారే
బలశౌర్యములు నీవే ||సృష్టి||

2. మా వెండి బంగారములు నీవే మాకున్న వరములు నీవే మా దేహముల్
మా గేహముల్ మా జీవితము నీవే ||సృష్టి||

3. వెలలేని గాలి వెలుతురులు విలువైన పాడి పైరులు వివిధంబులైన
దీవెనలు నీ కరుణా వర్షములు ||సృష్టి||

4. పరిశుద్ధ గ్రంథపు పలుకులు పాలోక తేనె చినుకులు ప్రభు యేసుని
మాటలు మా వెల్గు బాటలు ||సృష్టి||

5. మాదంత నీదే మహా దేవా మా రాజువయ్యా యెహోవా మా తనువుల్
మా బ్రతుకుల్ మా యావదాస్తి నీవే ||సృష్టి||

6. మేమిచ్చు కాన్క యేపాటిది? యే ప్రేమ నీకు సాటిది? మోక్ష నాధా
యేసుప్రభో అంగీకరించువిభో ||సృష్టి||

7. తండ్రి కుమార శుద్ధాత్ముడా త్రియేక దేవ స్తోత్రముల్ దాత వీవే నేతవీవే
దేవాది దేవుండవే ||సృష్టి||

Your favourites

  • No Favourites found!