Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
స్థిరపరచువాడవు బలపరచువాడవు Telugu Christian Song Lyrics

స్థిరపరచువాడవు బలపరచువాడవు Lyrics

స్థిరపరచువాడవు బలపరచువాడవు
పడిపోయిన చోటే నిలబెట్టువాడవు
ఘనపరచువాడవు హెచ్చించువాడవు
మా పక్షము నిలిచి జయమిచ్చువాడవు (2)

ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు
నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు (2)
యేసయ్యా.. యేసయ్యా .. నీకే నీకే సాధ్యము (2)

సర్వకృపానిధి మా పరమ కుమ్మరి
నీ చేతిలోనే మా జీవమున్నది (2)
మా దేవా నీ ఆలోచనలన్ని ఎంతో గొప్పవి
మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి (2)            ||ఏమైనా||

నీ ఆజ్ఞ లేనిదే ఏదైన జరుగునా?
నీ కంచె దాటగ శత్రువుకు సాధ్యమా? (2)
మా దేవా నీవే మా తోడుంటే అంతే చాలును
అపవాది తలచిన కీడులన్ని మేలైపోవును (2)            ||ఏమైనా||

Your favourites

  • No Favourites found!