స్తుతికి పాత్రుడా నా హృదయాన కొలువైన | Hosanna Ministries Nellore | Pas. Anand Jaya Kumar, Pas. Srikanth Paul Praveen
పల్లవి: స్తుతికి పాత్రుడా
నా హృదయాన కొలువైన – స్తోత్రార్హూడా (2)
1. అలసిపోతిని – జీవిత పయనంలో
బలపరచితివి – జీవాహారముతో (2)
లెమ్ము బహుదూర – ప్రయాణముందని
నీ ఆత్మ శక్తితో – నడిపించుచుంటివి (2)
యేసయ్యా – యేసయ్యా
కృతజ్ఞతా స్తుతులు ||స్తుతికి పాత్రుడా||
2. కృపగల దేవా – కలువరి నాధా
నీలా ప్రేమించి – క్షమించువారెవరు (2)
నీవే నా యెడల – కృప చూపకపోతే
నేనీ స్థితిలో – ఉండేవాడనా (2)
యేసయ్యా – యేసయ్యా
కృతజ్ఞతా స్తుతులు ||స్తుతికి పాత్రుడా||
3. సరిచేసితివి – నా జీవితమును
పలికించితివి – జీవన రాగాలు (2)
నిన్నే నా మదిలో – నిలుపుకొంటిని
సీయోనులోనుండి – ఆశీర్వదించుము (2)
యేసయ్యా – యేసయ్యా
కృతజ్ఞతా స్తుతులు || స్తుతికి పాత్రుడా ||
