Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
స్తోత్ర గీతములను పాడుచు ప్రియ ప్రభుని Telugu Christian Song Lyrics

స్తోత్ర గీతములను పాడుచు ప్రియ ప్రభుని Lyrics

స్తోత్ర గీతములను పాడుచు - ప్రియ ప్రభుని పూజించుడి
హల్లెలూయ - హల్లెలూయ - హల్లెలూయ
హల్లెలూయ - హల్లెలూయ - హల్లెలూయ
స్తోత్ర గీతములను పాడుచు - ప్రియ ప్రభుని పూజించుడి
1. రారండి సంతసించుచు - రారాజును కీర్తించను
రాజులకు రాజని - ప్రభువులకు ప్రభువని
రమ్యమైన రాజును స్తుతించెదం
2. సిలువలో బలియాయెను - విలువైన రక్తము కార్చెను
ఎంత శ్రమనొందెను - ఎంత బాధ నోర్చెను
తన రక్తముతో మనల కొనెగదా
3. విందు శాలకు తెచ్చెను - ప్రేమ ధ్వజము పైకెత్తెను
వింత సుందరుడని - వేలలో శ్రేష్ఠుడని
ఎంతైన జేయు సామర్థ్యుడని
4. మన ఆత్మ ప్రాణ - దేహముల్ - సజీవముగ నర్పింతుము
అత్తరును పూసిన - మరియ వలె మనమును
పరిమళంబులన్ ప్యాపింప జేయుదం
5. ప్రశంసించె ప్రభువు మరియను - మంచి కార్యము చేసెనని
ప్రభువు కొరకు చేయుము - ప్రాణము నర్పించుము
ప్రభువే సర్వము మనకు
6. మరణమున్ తానే గెల్చెను - సైతానును ఓడించెను
మరణమున్ మ్రింగెను - మరణముల్లు విరిచెను
జయము జయమటంచు ఆర్భటించెదం
7. ఆర్భాటముగా ప్రభువు - మేఘారూఢుడై వచ్చును
నిశ్చయముగా మనలను కొనిపోవు వేగమే
మహిమ దేహములను పొంది యుందుము


Your favourites

  • No Favourites found!