స్తోత్ర గానము నీకే యేసయ్యా
క్షేత్రములన్నిటిలో మించిన దేవుడవు (2)
సాటిరారు ప్రఖ్యాతులెవ్వరు
సరిలేరయ్యా నీకు ఏ దైవము (2)
స్తుతి నైవేద్యంతో నిను పూజింతును
ఉత్సాహ ధ్వనులతో నిను ఆరాధింతును (2)
|| స్తోత్ర గానము ||
1. గిరులన్నిటిలో ఎంత వెదకినను
అమరులు లేరు నీ వంటి వారు_(2)
వేల్పులలో బహుఘనుడవు నీవయ్యా_(2)
ఇహపరమందు నీవే పూజార్హుడవు_(2)
|| స్తుతి నైవేద్యముతో ||
2. మేఘాలలో నీటి నిధులను దాచి
భూమిని సిరులతో దీవించితివి_(2)
జనులందరికీ పోషణ నీవయ్యా_(2)
నీతో పోల్చదగిన దేవుడు లేడయ్యా_(2)
|| స్తుతి నైవేద్యముతో ||
3. అమరుడవు నీవు అదృశ్య దేవుడవు
దాసుని రూపమును ధరియించితివి_(2)
రిక్తునిగా సిలువను మోసితివి_(2)
నీ త్యాగనిరతిని కొనియాడెదయేసయ్య_(2)
|| స్తుతి నైవేద్యముతో ||
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
స్తోత్ర గానము నీకే యేసయ్యా క్షేత్రములన్నిటిలో Lyrics
Your favourites
- No Favourites found!
