Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
స్తోత్రము సేయరే సోదరులార మన యాత్మలతోఁ Telugu Christian Song Lyrics

స్తోత్రము సేయరే సోదరులార మన యాత్మలతోఁ Lyrics

స్తోత్రము సేయరే సోదరులార మన యాత్మలతోఁ దండ్రిన్ ధాత్రిని
మన పర మాత్ముని వాక్కులు స్తోత్రములోఁ గలిపి ||స్తోత్రము||

1. ఇచ్చట ప్రేమల కిదియే కడవరి వచ్చియున్న దేమో అచ్చట మన
మం దఱముఁ గలిసికొని యానందింతుముగా ||స్తోత్రము||

2. ఎక్కువ ప్రేమలు చక్కని స్తోత్రము లక్కడ మన మంత మిక్కిలి
ప్రియుడు దేవుని కిడుదుము ఒక్క మనసుతోను ||స్తోత్రము||

3. కన్నీ రుండదు చావు కష్టము లెన్నటి కుండవుగా కన్నను మన శృం
గారపు బ్రతుకు లెన్నఁదరము గాదె ||స్తోత్రము||

4. వాగును వీణెలు సాగును పాటలు సతతముగా నచట రాగము
లెంతో రమ్య మై యుండును బాగింతన లేము ||స్తోత్రము||

5. మరల నిచటఁ గూ డుదుమో లేదో మన మందరము త్వరలో మున
పర లోకపు దండ్రి తోడ నుందు మేమో ||స్తోత్రము||

6. గొఱ్ఱెపిల్ల రక్తము విలువచ్చుట గొప్పది గాంతుముగా గురుతరమగు
మన దేవుని ప్రేమను కూర్మితో జూతుముగా ||స్తోత్రము||

7. పరమ తండ్రితోఁ ప్రభుయేసునితోఁ బరిశుద్ధాత్మునితో
స్థిరముగనుందుము మరి దూతలతోఁ బరలోకమునందున్ ||స్తోత్రము||

Your favourites

  • No Favourites found!