Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
స్తోత్రము స్తోత్యమయ్యా దేవా స్తోత్రము స్తోత్యమయ్యాఅను Telugu Christian Song Lyrics

స్తోత్రము స్తోత్యమయ్యా దేవా స్తోత్రము స్తోత్యమయ్యాఅను Lyrics

స్తోత్రము స్తోత్యమయ్యా దేవా - స్తోత్రము స్తోత్యమయ్యా
అను నేత్రమువలె గత వత్సరము - మిత్రుడా బ్రోచితివి
స్తోత్రము స్తోత్యమయ్యా
1. ఎన్నో గొప్ప కీడులు మాకు - పెన్నుగా కలిగినన్
అన్నియు మా చెంత చేరకుండునట్లు - మన్నాధిపా బ్రోచితి
2. పేరాశ పాపంబుల నీవు - ధారాళముగ మన్నించి
ఈ వత్సరమందు పాపమున పడకుండ - నోవత్సా కాపాడుము
3. ఆనందారంభంతో నిండు - ఆశతో ప్రేమించి
భూమియందు రక్షకుడుగ జన్మించిన స్వామి నిన్ను కొల్తుము
4. ఈ క్రొత్త యేడునందు మా అక్కర మేళ్ళన్నియు
సతతము మాకు దయతోడ తీర్చుమో - వింత యేసు రక్షకా
5. గద్దియ జీవితము నీతో ముదముతో సల్పుటకు
నిత్యము యేసును ప్రేమతో వెంబడింప - నన్ను కనికరింపుము
6. దేశకీడు తొల్గను - ఇంక - దోషములు వీడను
హోసన్నా ఏకంబుగా పాడుటకు - దాసుల కరుణింపుము
7. హల్లెలూయ పాటను నీ ఏట నెక్కువగా పాడన్
దిక్కులవారికి సువార్త ప్రకటింప - గ్రక్కున వరములిమ్ము

Your favourites

  • No Favourites found!