Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
స్తోత్రము యేసునాథా నీకు సదా స్తోత్రము Telugu Christian Song Lyrics

స్తోత్రము యేసునాథా నీకు సదా స్తోత్రము Lyrics

1. స్తోత్రము యేసునాథా నీకు సదా - స్తోత్రము యేసునాథా
స్తోత్రము చెల్లింతుము నీదు దాసులము - పిత్రపుత్రాత్మలకు
2. నేడు నీదు నామమందున - మేము చేరి స్తుతించునట్లు
చేసిన కృపకై నీకే నిరతము - స్తోత్రము చేసెదము
3. నీదు రక్తధారచే కలిగిన - సజీవ నవమార్గము
దాసులము తండ్రి సన్నిధి చేరను - నిత్యము స్వాతంత్ర్యము
4. ఇట్టి ప్రభావమైన పదవిని - పురుగులమగు మాకు
ఇంత దయతోడ నిచ్చిన కృపమా - కెంతయు నాశ్చర్యము
5. దూతల సైన్యములు శృంగార - గీతముల నెప్పుడు
రాజాధిరాజా నీ స్తుతులు పాడుచు - నార్భటించుచుందురు
6. నీవు తఫ్ఫ మాకు పరమందున - వేరెవరు గలరు?
ఇద్దరయందు నీవు తప్ప మాకు ఆదరణ ఎవరు?


Your favourites

  • No Favourites found!