Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
స్తోత్రించెదము దైవకుమారుని నూతన జీవముతోనిరంతరము మారని Telugu Christian Song Lyrics

స్తోత్రించెదము దైవకుమారుని నూతన జీవముతోనిరంతరము మారని Lyrics

1. స్తోత్రించెదము దైవకుమారుని - నూతన జీవముతో
నిరంతరము మారని రాజును - ఘనంబు చేయుదము
యేసు మా రక్షకుడు - కల్మషము లేనివాడు
సమస్తమును కలిగిన యేసు ప్రభునకే హల్లెలూయ
2. భయంకరమైన భీతిని గొల్పెడు - జిగట ఊబినుండి
బలమైన హస్తముతో నన్ను ఎత్తి - బండపై స్థిరపరచెను
3. కనుపాపగ నను కాయు ప్రభుండు - కునుకడు నిద్రించడు
తనచేతితో ననుచెక్కిన ప్రభువును చేరి స్తుతించెదము
4. తల్లిదండ్రియు యెడబాసినను - విడువక కాయును
ఎల్లప్పుడు నేను భజియించెదను - వల్లభుడేసు ప్రభున్
5. ఆత్మీయ పోరాటమునకు ప్రభువు - ఆత్మశక్తినిచ్చెన్
స్తుతియు నీకే ఘనతయు నీకే - యుగయుగములలోన


Your favourites

  • No Favourites found!