Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
స్తోత్రించి కీర్తింతుము ఘనపరచెదము కొనియాడెదము ఆదరించి Telugu Christian Song Lyrics

స్తోత్రించి కీర్తింతుము ఘనపరచెదము కొనియాడెదము ఆదరించి Lyrics

స్తోత్రించి కీర్తింతుము - ఘనపరచెదము - కొనియాడెదము
ఆదరించి - కాపాడువాడు - ఈడేర్చువాడు
1. మనకింత వరకు సహాయపడెన్ - తానప్పగించుకొనే మనకై
మనల నడిపెను సుఖముగను
తనదు సత్యము నేర్పించి - కనుపాపగ కాచె ఆ ...
2. ఈ ధరలోని నరులలో - యధార్థ హృదయులకు
ముదమున తనచిత్తము తెలుపున్
పదిలముగ ప్రభుకన్నులు - పృథివిని పరుగెత్తు ఆ ...
3. అన్ని సమయములలో - కన్నులతో బోధించును
నన్ను మార్చెను తప్పినన్
పెన్నుగ హృదయము నాదరించె - అన్న గురుయేసు ఆ ...
4. అగ్ని వంటి కన్నులు - విఘ్నముల నుండి విడిపించు
తగిన సహాయము చేయును
ఎక్కాలమందున కునుకవు - మక్కువ పిల్లలకు ఆ ...
5. హాగరును చూచిన కన్నులు - అనేకుల చూచెను
ఇశ్రాయేలుల కనికరించె
ఎజ్రాకు సహాయపడెన్ - నిద్రించవు నెపుడు ఆ ...
6. నీతిమంతుల జూచె - దాదిబోలె కాచెను
జ్యోతుల వలె నుండును
అతిబలమిచ్చు అవసరతన్ - క్షితినిను విడువడు ఆ ...
7. ఏడు కన్నులు గలవాడు - నాడు నేడు కాపాడును
ఎడతెగని చెడుగుల బాపున్
రీడుల నేర్పరచు వాడు - పాడుడి హల్లెలూయ ఆ ...


Your favourites

  • No Favourites found!