Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
స్తోత్రింతుము నిను మాదు తండ్రి సత్యముతో Telugu Christian Song Lyrics

స్తోత్రింతుము నిను మాదు తండ్రి సత్యముతో Lyrics

స్తోత్రింతుము నిను మాదు తండ్రి
సత్యముతో ఆత్మతో నెపుడు
అను పరిశుద్ధాలంకారములతో
దర్శించెదము శరణం శరణం
1. శ్రేష్ఠ యీవుల యూట నీవే - శ్రేష్ఠ కుమారుని యిచ్చినందున
త్రిత్వమై యేకత్వమైన త్రి-లోక నాథా శరణం శరణం
2. పాపి మిత్రుడ పాప నాశక - పరమవాసా ప్రేమపూర్ణా
వ్యోమపీఠుడా స్వర్ణమయుడా - పరిశుద్ధాంగుడ శరణం శరణం
3. ధవళవర్ణుడ రత్నవర్ణుడ - సత్యరూపి యనబడు వాడా
నను రక్షించిన రక్షకుండవు - నాథ నీవే శరణం శరణం
4. బంగారు వెంట్రుకలు తలపై - ఉంగరములుగ కనబడినవి
వేలలో నతి కాంక్షణీయుడా - వేలకొలది శరణం శరణం
5. గువ్వల వంటి కన్నులు - పువ్వుల వంటి చెక్కిళ్ళు
మంచి రూపము కలిగినందున - మాకు నీవే శరణం శరణం
6. చేతులు బంగారుమయము - చెక్కిన రత్నముల వంటివి
కాళ్ళు రాతిస్తంభములవలె - కన్పడుచున్నందున శరణం
7. సంఘమునకు శిరస్సు నీవే - రాజా నీకే నమస్కారములు
ముఖ్యమైన మూలరాయి - కోట్లకొలది శరణం శరణం
8. నీదు సేవకుల పునాది - జ్ఞనమునకు మించిన తెలివి
అందముగను కూడుకొనుచు - వేడుకొందుము శరణం శరణం
9. రాజ నీకే నమస్కారములు - గీతములు మంగళ ధ్వనులు
శుభము శుభము శుభము నిత్యము - హల్లెలూయ ఆమెన్ ఆమెన్


Your favourites

  • No Favourites found!