Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
స్తుతి గానమే పాడనాజయగీతమే పాడనా నా Telugu Christian Song Lyrics

స్తుతి గానమే పాడనాజయగీతమే పాడనా నా Lyrics

స్తుతి గానమే పాడనా
జయగీతమే పాడనా (2)
నా ఆధారమైయున్న
యేసయ్యా నీకు – కృతజ్ఞుడనై
జీవితమంతయు సాక్షినై యుందును (2) ||స్తుతి||
నమ్మదగినవి నీ న్యాయ విధులు
మేలిమి బంగారు కంటే – ఎంతో కోరతగినవి (2)
నీ ధర్మాసనము – నా హృదయములో
స్థాపించబడియున్నది – పరిశుద్ధాత్మునిచే (2) ||స్తుతి||
శ్రేష్టమైనవి నీవిచ్చు వరములు
లౌకిక జ్ఞానము కంటే – ఎంతో ఉపయుక్తమైనవి (2)
నీ శ్రేష్టమైన – పరిచర్యలకై
కృపావరములతో నను – అలంకరించితివే (2) ||స్తుతి||
నూతనమైనది నీ జీవ మార్గము
విశాల మార్గము కంటే – ఎంతో ఆశించదగినది (2)
నీ సింహాసనము – నను చేర్చుటకై
నాతో నీవుంటివే – నా గురి నీవైతివే (2) ||స్తుతి||

Your favourites

  • No Favourites found!