Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
స్తుతి మధుర గీతము – వేలాది Telugu Christian Song Lyrics

స్తుతి మధుర గీతము – వేలాది Lyrics


స్తుతి మధుర గీతము – వేలాది స్తోత్రము
చెల్లించుటే నా ధన్యత
బహు గొప్ప స్థానము – శ్రీ యేసు పాదము
చేరడమే నా ఆతృత
అన్నీ తలాంతులు నీ కొరకే వాడెద
నూరంత ఫలములను నూరేళ్లు ఇచ్చెద      ||స్తుతి||

కనులకే కనపడలేని నా కంటి పాపవై
కాళ్ళకే తెలియక నన్ను చేర్చేవు గమ్యము (2)
నాకే తెలియక నాలో
నీవు నాదు ప్రాణ శ్వాసవై
నడిపించావా దేవా ఇన్నాళ్లుగా        ||స్తుతి||

అణువణువు నీ కృప చేత నిండుగా నను నింపి
నీలాంటి పోలిక కలుగ శరీరం పంచితివి (2)
రాతి గుండెను దిద్ది
గుడిగా మార్చుకున్న దైవమా
ముల్లును రెమ్మగా మార్చితివి        ||స్తుతి||

Your favourites

  • No Favourites found!