స్తుతి పాడుటకే బ్రతికించిన
జీవనదాతవు నీవేనయ్యా
ఇన్నాళ్లుగా నను పోషించిన
తల్లివలె నను ఓదార్చిన
నీ ప్రేమ నాపై ఎన్నడు మారదు యేసయ్యా (2)
జీవితకాలమంతా ఆధారం నీవేనయ్యా
నా జీవితకాలమంతా ఆరాధించి ఘనపరతును
||స్తుతి పాడుటకే||
1. ప్రాణభయమును తొలగించినావు
ప్రాకారములను స్థాపించినావు
సర్వజనులలో నీ మహిమ వివరింప
దీర్ఘాయువుతో నను నింపినావు (2)
నీ కృపా బాహుళ్యమే వీడని అనుబంధమై
తలచిన ప్రతిక్షణమున నూతన బలమిచ్చెను
||స్తుతి పాడుటకే||
2. నాపై ఉదయించె నీ మహిమ కిరణాలు
కనుమరుగాయెను నా దుఖ:దినములు
కృపలనుపొంది నీ కాడి మోయుటకు
లోకములోనుండి ఏర్పరచినావు (2)
నీ దివ్య సంకల్పమే- అవనిలో శుభప్రదమై
నీ నిత్య రాజ్యమునకై నిరీక్షణ కలిగించెను
||స్తుతి పాడుటకే||
3. హేతువులేకయే ప్రేమించినావు
వేడుకగా ఇల నను మార్చినావు
కలవరమొందిన వేళలయందు
నా చేయి విడువక నడిపించినావు (2)
నీ ప్రేమ మాధుర్యమే నా నోట స్తుతిగానమై
నిలిచిన ప్రతి స్థలమున పారెను సెలయేరులై
||స్తుతి పాడుటకే||
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
స్తుతి పాడుటకే బ్రతికించిన జీవనదాతవు Lyrics
Your favourites
- No Favourites found!
