Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
స్తుతి పాడుటకే బ్రతికించిన – జీవనదాతవు Telugu Christian Song Lyrics

స్తుతి పాడుటకే బ్రతికించిన – జీవనదాతవు Lyrics


స్తుతి పాడుటకే బ్రతికించిన – జీవనదాతవు నీవేనయ్యా
ఇన్నాళ్లుగా నను పోషించిన – తల్లివలె నను ఓదార్చిన
నీ ప్రేమ నాపై ఎన్నడు మారదు యేసయ్యా (2)
జీవితకాలమంతా ఆధారం నీవేనయ్యా
నా జీవితకాలమంతా ఆరాధించి ఘనపరతును       ||స్తుతి పాడుటకే||

ప్రాణభయమును తొలగించినావు – ప్రాకారములను స్థాపించినావు
సర్వజనులలో నీ మహిమ వివరింప దీర్ఘాయువుతో నను నింపినావు (2)
నీ కృపా బాహుళ్యమే వీడని అనుబంధమై
తలచిన ప్రతిక్షణమున నూతన బలమిచ్చెను       ||స్తుతి పాడుటకే||

నాపై ఉదయించె నీ మహిమ కిరణాలు – కనుమరుగాయెను నా దుఖ:దినములు
కృపలనుపొంది నీ కాడి మోయుటకు లోకములోనుండి ఏర్పరచినావు (2)
నీ దివ్య సంకల్పమే- అవనిలో శుభప్రదమై
నీ నిత్య రాజ్యమునకై నిరీక్షణ కలిగించెను       ||స్తుతి పాడుటకే||

హేతువులేకయే ప్రేమించినావు – వేడుకగా ఇల నను మార్చినావు
కలవరమొందిన వేళలయందు నా చేయి విడువక నడిపించినావు (2)
నీ ప్రేమ మాధుర్యమే నా నోట స్తుతిగానమై
నిలిచిన ప్రతి స్థలమున పారెను సెలయేరులై       ||స్తుతి పాడుటకే||

Your favourites

  • No Favourites found!