Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
స్తుతి సింహాసనాసీనుడా నా ఆరాధనకు పాత్రుడా Telugu Christian Song Lyrics

స్తుతి సింహాసనాసీనుడా నా ఆరాధనకు పాత్రుడా Lyrics


స్తుతి సింహాసనాసీనుడా
నా ఆరాధనకు పాత్రుడా (2)
నీవేగా నా దైవము
యుగయుగాలు నే పాడెదన్ (2)     ||స్తుతి||

నా వేదనలో నా శోధనలో
లోకుల సాయం వ్యర్థమని తలచి (2)
నీ కోసమే – నీ కృప కోసమే (2)
నీ వెలుగులో నిలిచానయ్యా
యేసయ్యా.. నీ ఆత్మతో నింపుమయ్యా (2)     ||స్తుతి||

నీ సేవలోనే తరియించాలని
నీ దరికి ఆత్మలను నడిపించాలని (2)
నీ కోసమే – నీ కృప కోసమే (2)
నీ సముఖములో నిలిచానయ్యా
యేసయ్యా.. నీ శక్తితో నింపుమయ్యా (2)     ||స్తుతి||

నా ఆశయముతో నా కోరికతో
నా గురి నీవని పరుగిడుచుంటిని (2)
నీ కోసమే – నీ కృప కోసమే (2)
నీ వెలుగులో నిలిచానయ్యా
యేసయ్యా.. నీ మహిమతో నింపుమయ్యా (2)     ||స్తుతి||

Your favourites

  • No Favourites found!