పల్లవి:
స్తుతించెదను..స్తుతించెదనూ..
నా యేసు ప్రభున్ కృతజ్ఞతతో అనుదినము - స్తుతించెదను (2X)
1.
ఉన్నత దేవుడు సర్వాధిపతియు - ఉర్విపరిపాలక
ఉన్నతం విసర్జించి నన్ను వెదకిన - ఉత్తమ స్నేహితుని
ఉదయం సంధ్యా - ఎల్లప్పుడును - ఉత్సాహధ్వనితో పాడెదను (2X)
...స్తుతించెదను...
2.
నాశనకరమైన పాప గుంటనుండి నరక వేదననుండి
నన్ను విడిపించి నిలిపిన దేవా - నిర్మలా స్వరూప
నీతి సమాధానం సంతోషముతో - నిత్యజీవము నాకీచ్చితివి (2X)
...స్తుతించెదను...
3.
పాపము క్షమించి రోగము - బాపి భయమును దీర్చి
పవిత్రదాయక పావనమూర్తి - పరిశుద్ధ మిచ్చిన
పరమ పాదం శరణ్యం నాకు - పరమరాజా పుణ్యదేవా (2X)
...స్తుతించెదను...
4.
తల్లిగర్భమునకు ముందేర్పరచి -దేహము నమర్చియు
దక్షిణ బాహుతొ పట్టుకొనిన - దయా సంపూర్ణుడా
దిక్కు జయము ఆదరణయు -దయతో అనుగ్రహించితివి (2X)
...స్తుతించెదను...
5.
సిలువనెత్తి శ్రమలు సహించ - సేవకు పిలచిన
స్నేహ దర్శక వీర యోధ - సంశయ హరక
శ్రమలు నింద ఆకలియైన - నీ స్నేహము నుండి ఎడబాపునా (2X)
...స్తుతించెదను...
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
స్తుతించెదను..స్తుతించెదనూ.. నా యేసు ప్రభున్ Lyrics
Your favourites
- No Favourites found!
