Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
స్తుతింతున్ పరిశుద్దుని ఆరాధనతో ఇంతవరకు కాచె Telugu Christian Song Lyrics

స్తుతింతున్ పరిశుద్దుని ఆరాధనతో ఇంతవరకు కాచె Lyrics

స్తుతింతున్ పరిశుద్దుని ఆరాధనతో - ఇంతవరకు కాచె దేవుడే
1. ఇరువదై దేండ్లు గాచెన్ - కొరతలేని మేళ్ళనిచ్చె
చేర్చె ప్రజల నెందరినో - చేరిపాడి స్తుతించెదము
2. సువార్త సైన్యము నిచ్చి - భువిపై శత్రుని పనినాపే
వినిన వారిని ప్రత్యేకించే - చేరిపాడి స్తుతించెదము
3. పరిశుద్ధ సంఘము కూర్చె - నేర్పె సత్య మర్మములు
సరిగ సాక్ష్యము స్థాపించె - చేరిపాడి స్తుతించెదము
4. సేవకులనిచ్చెను బహుగా - కావలి యుంచెను ప్రభువే
సహపని వారి నొసగె - చేరిపాడి స్తుతించెదము
5. ఇండియాలో ఈ నగరు - అంతియొకయ వలె జేసె
స్వంతముగను జేసికొనెన్ - చేరిపాడి స్తుతించెదము
6. పరమ దర్శనము నిచ్చె - సరిగా లోబరచె మనల
కరము నిచ్చె నడిపించె - చేరిపాడి స్తుతించెదము
7. సంఘ మర్మనును దెల్పి - శీఘ్రముగ నంపెను వార్త
పార్చె పాపుల నెందరినో - చేరిపాడి స్తుతించెదము


Your favourites

  • No Favourites found!